బీసీలకు రిజర్వేషన్లు 34శాతం అమలు చేయాలి

బీసీలకు రిజర్వేషన్లు 34శాతం అమలు చేయాలి



న్యూస్ ఫోర్స్,నెల్లూరు:భారత రాజ్యాంగం కల్పించిన బీసీల రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ లో 34శాతం ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్ రావు గౌడ్ పేర్కొన్నారు.నగరంలోని స్థానిక  హోటల్ యాష్ పార్క్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లు34శాతం ఖచ్చితంగా అమలుచేయాలని, బీసీలకు ద్రోహం చేయవద్దు ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం కేవలం బీసీలపై కపట ప్రేమ అవలభిస్తుందని రాష్ట్రములో బీసీలకు స్థానిక సంస్థలఎన్నికల్లో 10శాతం వరకే రిజర్వేషన్లు ఇచ్చి అన్యాయం చేసిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.అలాగే వివిధ రాజకీయ పార్టీల నేతలు బీసీలపై ఎన్నికలప్పుడే లేని ప్రేమ చూపిస్తూ బీసీలకు తమ పార్టీనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని పేరుకు ప్రకటనలు చేసుకుంటున్నాయని దుయ్యబట్టారు.ఇకనైనా బీసీలపై దొంగప్రేమలు మాని వారికి ఇవ్వాల్సిన సీట్లను ఇచ్చి  న్యాయం చేయండని ఆయన హితవుపలికారు. ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకుడు నాసిన భాస్కర్ గౌడ్,రాష్ట్ర కార్యదర్శి అబూబాకర్,జిల్లా అధ్యక్షుడు గిరీష్,మహిళ అధ్యక్షురాలు విజయమ్మ,మీడియా ఇంఛార్జ్ వెంపులూరు మల్లికార్జున్ గౌడ్,బీసీ నాయకులు వేణు,రాంప్రసాద్, జేజే నారాయణ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#