ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు


 


న్యూస్ ఫోర్స్,నెల్లూరు: 9వ డివిజన్ లో మహిళా సంరక్షణ కార్యదర్శుల ఆధ్వర్యంలో నవాబుపేట పత్తి వారి స్కూల్ లో మహిళా  దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ మహిళలు దిశా యాప్ పైన అవగాహన పెంచుకోవాలని తెలియచేశారు.స్కూల్ ప్రధాన ఉపాద్యాయులు అయిన జాస్మిన్ ని అతిధులు ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్,  మహిళా కార్యదర్శులు సబిహాబేగం,శర్వాణి, రూపా, సుస్మిత,పొదుపు సీఓ గీతా, పొదుపు ఆర్ పి లు,అంగన్వాడీ వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్


#