రంగడికి పట్టు వస్త్రాలు సమర్పణ

    రంగడికి పట్టు వస్త్రాలు సమర్పణ



న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగరంలోనిరంగనాయకులపేటలో వున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి రథోత్సవం సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  పి. అనిల్ కుమార్ , రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లోక్ సభ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి లతో కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు ముక్కాల ద్వారకనాథ్, కొండ్రెడ్డి రంగారెడ్డి, పి. రూప్ కుమార్ యాదవ్, కొణిదల సుధీర్, శ్రీరాం సురేష్, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#