రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
★కోడ్ అమల్లోకి
న్యూస్ ఫోర్స్,అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ శనివారం ఉదయం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వారి కార్యాలయంలో స్థానిక సంస్థలకు చెందిన ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసారు.
జడ్పిటిసి/ఎంపిటిసి స్థానాలు కోసం ఎన్నికలు ఒకే దశలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.
నోటిఫికేషన్ జారీ తేదీ : 7.3.2020
రిటర్నింగ్ అధికారి/ ఎన్నికల అధికారి చే ఎన్నికల నోటీస్ జారీ తేదీ: 09.03.2020
నామినేషన్లు ప్రక్రియ తేదీ : 09.3.2020 నుంచి 11.03.2020 వరకు
నామినేషన్లు పరిశీలన తేదీ: 12.3.2020
తిరస్కరించబడిన నామినేషన్లు పై అప్పీల్ కు కలెక్టర్/ఆర్డీఓ ముందు వెళ్లేందుకు తేదీ.13.03.2020 (జడ్పీటిసి విషయం లో కలెక్టర్ వద్దకు)(ఎంపిటిసి విషయం లో ఆర్డీవో వద్దకు)
అప్పీళ్లు పరిష్కారం చేసే తేదీ: 14.3.2020 మ.1 గంట ముందు వరకు
అభ్యర్థిత్వము ల (నామినేషన్లు) ఉపసంహరణ తేదీ: 14.3.2020 మ. 3 .00 వరకు
పోటీ చేయు అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ తేదీ :14.3.2020 మ. 3 .00 తరువాత
పోలింగ్ నిర్వహించే (అవసరమైన పక్షంలో) తేదీ: 21.03.2020 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు
ఓట్ల లెక్కింపు తేదీ: 24.3.2020 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమగును.ఓట్ల లెక్కింపు పూర్తి అయిన వెంటనే ఫలితాలు ప్రకటన చెయ్యడం జరుగుతుందని రాష్ట్ర కమిషనర్ తెలిపారు.#ఎస్పీన్యూస్#