మహిళలు సగర్వంగా తలెత్తి బ్రతకాలి

మహిళలు సగర్వంగా తలెత్తి బ్రతకాలి


న్యూస్ ఫోర్స్,విజయవాడ:ఆకాశంలో సగంగా ఉన్న మహిళలు సగర్వంగా తలెత్తి ఆశాభావంతో తమ భవిష్యత్తు మరింత దేదీప్యమానమయ్యేలా జీవించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ ఎమ్ డి ఇంతియాజ్  పేర్కొన్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి సంక్షేమ సంఘం, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విజయవాడ లబ్బీపేటలోని సిద్ధార్థ డిగ్రీ మహిళా కళాశాల సెమినార్ హాలునందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రస్థాయి లేడీ లెజెండ్ ఇన్స్పిరేషన్ అవార్డు


ప్రధానోత్సవం  జరిగింది. జ్యోతీ ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మహిళలు వంటింటి కుందేళ్ళుగా మిగిలిపోకుండా దేశాధినేతలుగా, రాజ్యాంగ వేదికలపై నాయకురాళ్ళుగా, కంపెనీల ముఖ్యకార్య నిర్వహకులుగా, రాజకీయ పార్టీల అధినేత్రిలుగా ఒకటేంటి ప్రపంచంలోని అన్నీ రంగాలను ఏలుతున్నారని తెలియజేశారు. మంగళగిరి వి ఆర్ హెడ్ క్వార్టర్స్ డి.ఎస్.పి ఎం బి ఎం మురళీకృష్ణ మాట్లాడుతూ  ఈ మహిళాదినోత్సవాలు మహిళల సమస్యలపై పోరాటాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. 1914 మార్చి 8న ఐరోపాలో మహిళలు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేశారన్నారు. అలా ప్రపంచదేశాలలో స్త్రీల పాత్ర పెరుగుతూ వచ్చి వివిధ వేదికలు మహిళా దినోత్సవాలకు స్థానం కల్పించాయని వివరించారు. అనంతరం సమాజ సేవకులైన గుంటుపల్లి లక్ష్మీ కుమారి, షేక్ ప్యారున్నీసా, ఎస్. రత్నకుమారి, నేతల విమల, కె రత్నమాలినీదేవి, డాక్టర్ లహరి, శాంతి జెమీమా కలపాల, కొర్రపాటి మీనాకుమారి, గొట్టిముక్కల సుజాత, ఎం. విజయలక్ష్మిలకు మొమెంటో, శాలువా, ప్రశంసా పత్రంతో ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అందె శ్రీనివాసులు, తమ్మినేని పాండు, కె. మురళీమోహన్ రాజు, కళాశాల డైరెక్టర్ డాక్టర్ టి. విజయలక్ష్మి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎమ్. నళిని, డాక్టర్ ఎస్. కల్పన, లక్ష్యం ఎడిటర్ చల్లా మధుసూదన్, కళ్ళం ఫణికుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#