సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
న్యూస్ ఫోర్స్,అమరావతి: రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.దేశంలో ఎవరు సాహసించని రీతిలో జగన్మోహన్ రెడ్డి మద్యం బంద్ చేశారు.ఎన్నికల కోడ్ ఉన్నందున అందులోనూ ఈ నెల12 నుండి29వరకు మద్యం షాపులు రాష్ట్రంలో మూసివేయాలని జగన్ ఆదేశించారు.ఎవరైన అతిక్రమించి షాపులు తీసినచో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.ప్రతి జిల్లాలో మద్యం షాపులు పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.