ఆరాచకాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని జగన్ మార్చాడు-మాజీ సీఎం
న్యూస్ ఫోర్స్: ఆరాచకాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చి వేసి ప్రజలను,విపక్షాలును సైతం భయబ్రాంతులకు గురిచేస్తూ ఏపీని నాశనం చేస్తున్నాడని సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మాజీ సీఎం,ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు.ప్రజా పాలనలో రాక్షసత్వాన్ని పెంచి పోషిస్తున్నారని విపక్షాలును స్థానిక సంస్థలఎన్నికల్లో నామినేషన్లు వేయనియకుండా అడ్డుకోవడం రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించడమేనన్నారు.రాష్ట్రంలో హింసాత్మక చర్యలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడ ప్రజలు తిరస్కరిస్తారని తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు కాకుండా అడ్డుకుని భయబ్రాంతులు సృష్టించి ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర డీజీపీ కూడా ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ అభ్యర్థులును,నాయకులను చంపేస్తారా..రాష్ట్రంలో స్వేచ్ఛగా పోటీ చేసే హక్కులు తమకు లేవా అంటూ ఆయన సీఎం జగన్ ని మీడియా ముందు ప్రశ్నించారు.జగన్ నియంత పాలన కొనసాగాలని ఏకగ్రీవ ఎన్నికకు ఉసుగొల్పుతూ తన పరాకాష్ట కొనసాగిస్తున్నారన్నారు. దీనికి ఓటు రూపంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.లేదంటే ప్రజలు మరింత రాక్షస పాలనలో దుర్భరమైన జీవితంలో భయంతో బ్రతుకుతారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.చివరిగా ప్రజలే ఆలోచించుకోవాలని ఆయన చెప్పారు.