రంగడి రధోత్సవానికి కరోనా దెబ్బ..!
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:ప్రతి ఏటా ఘనంగా జరిగే రంగడి రధోత్సవం కు కరోనా వైరస్ దెబ్బ తగిలింది.రంగ..రంగా.. నీకు కూడా కరోనా వైరస్ వ్యాధి సోకిందా స్వామీ..భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే ఈప్రాంతాలలో కరోనా వైరస్ వ్యాపించి ఉందనే అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రెండు రోజుల క్రితం నగరంలో కరోనా వైరస్ వ్యాధి సోకిందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న నెల్లూరు వాడు ఇటలీ దేశంకి వెళ్లి వచ్చి వ్యాధిని తీసుకొచ్చాడని నలుదిశలా వ్యాప్తి చెందింది.దీనిపై జిల్లా కలెక్టర్ కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఆదృష్ట్యా నేపథ్యంలో శ్రీ తల్పగిరి రంగనాథబ్రహ్మోత్సవాలు భాగంగా బుధవారం ఉదయం రంగడి రధోత్సవానికి కరోనా వైరస్ ఆటంకంగా ఏర్పడింది. అందులోనూ దేవాదాయశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ సూచన మేరకు తూర్పు ప్రాంతం వరకే రథాన్ని ముందుకు నడుపుతారా..లేకా గతంలో లాగానే యధావిధిగా కొనసాగిస్తారనేది.కొన్ని నిమిషాల్లోనే తేలనుంది.భక్తుల్లో కూడా ఆసక్తి రేకెత్తితోంది.