యువత నైపుణ్యత కలిగి ఉండాలి

యువత నైపుణ్యత కలిగి ఉండాలి


న్యూస్ ఫోర్స్,కావలి:యువత తలుచుకోవాలేగానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలరని కావలి పట్టణ డిఎస్పి డి. ప్రసాద్ పేర్కొన్నారు. నెహ్రూ యువకేంద్ర  ఆధ్వర్యంలో గురువారం ఉదయం కావలి పట్టణంలోని కో-ఆపరేటివ్ కాలనీ ఎం.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలనందు యువత నైపుణ్యత, శిక్షణా శిబిరం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం భవిష్యత్తు ఇప్పుడు యువత చేతుల్లో ఉంది. ప్రపంచదేశాల్లో ఎక్కడాలేని యువత మన దేశంలో ఉండడం ఎంతో అదృష్టమన్నారు.భారతదేశం  వనరులు ఎంతో సమృద్ధిగా ఉన్నదేశమని,కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో యువత కాస్త వెనకడుగులో ఉన్నదన్నారు. యువతలో గొప్ప ఆలోచనలువున్నా అవి ఆచరణలోకి వచ్చేప్పటికి ఎంతో చేయిదాటి పోతున్నారు. యువత ఇప్పటికైనా నడుం బిగించి అభివృద్ధివైపు మొగ్గు చూపాలని ఆకాంక్షించారు. కావలి మున్సిపల్ కమిషనర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వున్నారు. ఒక్కసారి వారి జీవన విధానాన్ని పరిశీలించండని, చదువు అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాదన్నారు.చదువు అనే ఆయుధం మీవెంట ఉంటే జ్ఞానాన్ని సంపాదించి తద్వారా మీ సృజనాత్మకతతో భవిష్యత్తులో మీరు ఎటువంటి ఉద్యోగానికి సరిపోతారో మీకు తెలుస్తుందని అన్నారు. చదువుతోపాటు అనేక రంగాల్లో రాణించిన వ్యక్తులు చరిత్ర పుటల్లో నిలిచిపోయారని గుర్తుచేశారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్  ఆకుల మహేందర్రెడ్డి, కరస్పాండెంట్ జి. రాజ్ కుమార్, మోటివేటర్ మెతుకు రాజేశ్వరి, గుర్రంకొండ సర్దార్, పి. మాధవి, మోటివేటర్ ఆర్. ప్రణీత్, శక్తి టీం షేక్ మంజాన్ బి, మోటివేటర్ కె. మురళిమోహన్ రాజు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనాథ్, మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#