బాలికలకు చట్టాలపై అవగాహన సదస్సు
న్యూస్ ఫోర్స్, నెల్లూరు:నగరంలోని నవాబుపేట్ పత్తివారి పాఠశాల లో బాలికలకు చట్టాలపై అవగాహన సదస్సు 9వ వార్డు మహిళ సంరక్షణ కార్యదర్శులు ఆధ్వర్యంలో నిర్వహించారు.విద్యార్థులకు దిశ చట్టం, సేఫ్ టచ్, ఆన్ సేఫ్ టచ్, బాల్య వివాహ చట్టం గురించి తెలిపారు.ఈకార్యక్రమంలో మహిళ కార్యదర్శులు యస్ కె సబీహ,పి.శార్వాణి,వి.రూప, డి.సుస్మితా, పాఠశాల హెడ్ మాస్టర్ యస్ కె. యాస్మిన్ తదితరులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#