వీసీ, రిజిస్ట్రార్ ని వెంటనే తొలగించాలి

వీసీ, రిజిస్ట్రార్ ని వెంటనే తొలగించాలి


న్యూస్ ఫోర్స్,నెల్లూరు:విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ చాన్సలర్,రిజిస్ట్రార్ లను యూనివర్సిటీ అభివృద్ధి గురించి పట్టించుకోవడంలేదని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ బంద్ కి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన రిజిస్ట్రార్, వీసీ ఇద్దరూ అభివృద్ధికి అడ్డంకిగా మారారని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.#ఎస్పీన్యూస్#