రాష్ట్ర వ్యాప్తంగా బయోమెట్రిక్ బంద్

రాష్ట్ర వ్యాప్తంగా బయోమెట్రిక్ బంద్



న్యూస్ ఫోర్స్,అమరావతి:రాష్ట్ర వ్యాప్తంగా బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.ప్రప్రంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధి రాష్ట్రములో కూడా వ్యాప్తి చెందింది. నెల్లూరు జిల్లాలో మొదటి కేసు పాజిటివ్ గా నమోదు చేసుకుంది.దీనితో రాష్ట్రవ్యాప్తంగా తగు జాగ్రత్తలో భాగంగా సీఎం జగన్ బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేసి పూర్వం అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.దీనితో రాష్ట్రములో వెంటనే అమలుచేయాలని సీఎస్ సాహ్ని పలు అధికారులుకు ఆదేశాలు జారీ చేశారు.#ఎస్పీన్యూస్#