కరోనా వ్యాధి పై జాగ్రతలెక్కడా..!?
★నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలపై దృష్టి లోపమా..!?
★అధికారులు తీసుకున్న జాగ్రత్తలేమి..!
★బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్,సినిమాహాల్స్ తదితర ప్రాంతాలు.
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:కరోనా వ్యాధిపై అధికారులు తీసుకున్న జాగ్రత్తలెక్కడా కనిపించడంలేదు.పేరుకు ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలోను,తగు చర్యలు తీసుకోవడంలోను నిర్లక్ష్యం వహిస్తున్నారు.దీనితో కరోనా వైరస్ ఒకరినుండి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందుతుంది.దీనిపై ప్రజలకు అవగాహన ఎక్కడా..!? క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజలకు కల్పించాల్సినవి ఎక్కడా..!?ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చును.మారు ముఖం(మాస్క్)లు అందుబాటులో ఉంచకుండా ,ప్రజలకు అందజేయకుండా ప్రభుత్వం, అధికారులు ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారో అని పలువురు విశ్లేషకులు మండిపడుతున్నారు.2రూపాయలు ఉన్న మాస్క్ లు ఇప్పుడు మార్కెట్ లో20రూపాయలు పెట్టిన దొరకడంలేదు.నిత్యం రద్దీగా ఉండే జనసంచారం కలిగిన ప్రాంతాలలో కూడా అధికారులు తీసుకున్న జాగ్రత్తలు ఎక్కడా కనపడటంలేదు.ఈ కరోనా వ్యాధి బారిన పడకుండా ముందస్తుగా అధికారులే ప్రజలకు ఉచితంగా మాస్క్ లు అందజేసి ఆయా ప్రాంతాలల్లో ,వాలంటరీల ద్వారా అందజేసినట్లైతే ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం పనిచేస్తుందని అధికారులను ప్రశంసిస్తారు. అలా కాకుండా పేరుకే ప్రకటనలు చేసుకుంటూ రోజులు గడిపేస్తే కరోనా వ్యాధి బారిన ఎంతో మంది బాధితులు పడే అవకాశం ఉంది.#ఎస్పీన్యూస్#