ఎన్నికలకు కుల సమావేశాలు సొమ్ములకోసమేనా..!?

ఎన్నికలకు కుల సమావేశాలు సొమ్ములకోసమేనా..!?


న్యూస్ ఫోర్స్,బ్యూరో:ఎన్నికల సమయంలో కుల సంఘాలు సమావేశాలు పెట్టుకుని రాజకీయ పార్టీల నాయకుల వద్ద సొమ్ము చేసుకుంటున్నారని పలు కుల సంఘ నాయకులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా ఉంటే వాటిపై ఎటువంటి సమావేశాలు, ఖండన లేకుండా కుల సమీకరణాలు చేస్తూ సొమ్ములకు అమ్ముడుపోతున్నారని బీసీల నాయకులు కొందరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నెల్లూరు నగరంలో ఒక ప్రక్క బీసీ సంఘం సమావేశం నిర్వహించి రిజర్వేషన్లు పై చర్చిస్తుంటే,మరో ప్రక్క కులాలు వారిగా సమావేశంలో ఏర్పాటు చేసుకుని తమ బలం ఇంతవుందని చెప్పుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని సీనియర్ బీసీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఎన్నికలప్పుడే తమ తమ కుల.సంఘాలు గుర్తొస్తాయ మిగతా రోజుల్లో వారి సమస్యలు పట్టించుకునే వారు లేరని బీసీ నాయకులు తీవ్రంగా  మండిపడుతున్నారు.#ఎస్పీన్యూస్#