టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రధాన నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
మనుబోలు మండలం మాజీ సాగునీటి సంఘం మరియు పి.ఏ.సి.యస్. అధ్యక్షులు ముంగర విజయ భాస్కర్ రెడ్డి మరియు వారి అనుచరులతో కలిసి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో టిడిపిని వీడి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 100 కుటుంబాలు.