మేకపాటికే పెద్దల సభ సీటు..!?

      మేకపాటికే పెద్దల సభ సీటు


 


న్యూస్ ఫోర్స్,నెల్లూరు: వైసీపీ కి దక్కే నాలుగు రాజ్యసభ స్థానాలలో ఒక స్థానం మేకపాటి రాజమోహన్ రెడ్డి కే ఇచ్చేందుకు సంకేతాలు ఏపీ సీఎం జగన్ నుండి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.విజయసాయిరెడ్డి స్నేహితుడయిన బీద మస్తాన్ రావుకు మొండిచేయి చూపినట్లు తెలుస్తున్నది. నిన్న మొన్న చేరిన వారికి సముచిత స్థానం కలిపిస్తే మొదట నుండి పార్టీ వెంట నడిచిన వారికి స్థానం కల్పించకపోతే  పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తాయని వాటికి అడ్డుకట్ట వేసేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.


 మేకపాటి రాజమోహన్ రెడ్డి మొదట నుండి జగన్ కి తోడుగా ఆయన స్వరాన్ని పార్లమెంట్ లో వినిపిస్తూ జగన్ కు వెన్నుదన్నుగా నిలిచారు.అంతేకాకుండా ప్రత్యేక హోదా కోసం జగన్ చెప్పిన వెంటనే తన యంపి పదవి కి రాజీనామా చేయడం, జగన్ సూచిస్తే వెంటనే పాటించడం చేస్తూ జగన్ మనస్సులో మేకపాటికి ఎవరు రారు సరిపాటిగా మారిపోయారు. అలా నమ్ముకున్న వారిని జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండి సముచిత స్థానం కల్పిస్తూ వారిలో ఆనందాన్ని నింపుతున్నారు.నెల్లూరు జిల్లాలో చూస్తే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా శాసించే జిల్లా అయిన నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ,బీసీ వర్గానికి చెందిన వాడు ,తనని నమ్ముకుని తన వెంట కష్ట నష్టాలు పడిన వ్యక్తికి  అధికారంలోకి రాగానే మంత్రి పదవుల్లో సుచరితమైనా మంత్రి పదవిని కట్ట బెట్టారు.అది జగన్మోహన్ రెడ్డి అంటే అనుకున్నట్లుగా చేశారు.అలాగే మేకపాటికి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు  సీఎం జగన్  సుముఖతగా ఉన్నారని  సమాచారం.