కరోనా..కరోనా.. జిల్లాలో భయాందోళన
న్యూస్ ఫోర్స్,అమరావతి:రాష్ట్ర వ్యాప్తంగా బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.ప్రప్రంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధి రాష్ట్రములో కూడా వ్యాప్తి చెందింది. జిల్లాలో కరోనావైరస్ దెబ్బకు ప్రజలు భయంతో వణికిపోతున్నారు.కరోనా వ్యాధి ఒకరినుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.దీని ప్రభావమే నెల్లూరు నగరంలో కె యల్ ఎం యన్ షాపింగ్ మాల్ వెనుక వైపు నివాసం ఉంటున్న 13కుటుంబాలు ఆ ప్రాంతం నుండి ఖాళీ చేసి వెళ్లిపోయారు.అలాగే వివిధ ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.జిల్లా కలెక్టర్ ఇప్పటికే అప్రమత్తమై జిల్లా వైద్య శాఖాధికారులును అదేశించి పలు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలందరూ భయపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ దరిచేరదని కలెక్టర్ తెలిపారు. అయితే ప్రభుత్వం అధికారులు ఎన్ని చెబుతున్న ప్రజల్లో మాత్రం భయాందోళన ఉంది.దీనితో కొందరు మానసికంగా మనోవ్యధకు గురవుతున్నారని పలువురు డాక్టరు లు చెబుతున్నారు. కరోనా వ్యాధి ఏపీ లోని 13జిల్లాలో ఒక్క నెల్లూరు జిల్లాలో మొదటి కేసు నమోదు కావడం వలన నెల్లూరు ప్రజలు భయపడుతున్నారు.ఒక ప్రక్క 23డిగ్రీలు వేడి ఉంటే ఈ వ్యాధి లో ఉన్న సూక్ష్మ జీవులు చనిపోతాయనే వాదన కూడా గట్టిగా వినపడుతోంది.ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వేసవి తాపం35 నుండి40 డిగ్రీల వరకు చేరుతుందని,దీనివలన కరోనా వైరస్ సూక్ష్మ జీవులు నశించిపోతాయని పలువురు విశ్లేషకులు వాదన మరో బలంగా ఉంది. ఏదిఏమైనా ప్రజల్లో మాత్రం ఈ భయాందోళన పొగొట్టే విధంగా జిల్లా అధికారులు మరింత శ్రమించి అవగాహన చర్యలు తీసుకుంటే గాని ఈ భయం పోదు.#ఎస్పీన్యూస్#