నెల్లూరు జడ్పి ఛైర్మన్ గా ఆనం ..!?

నెల్లూరు జడ్పి ఛైర్మన్ గా ఆనం ..!?



 


న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నెల్లూరు రూరల్ నుండి బరిలో దిగుతున్న జిల్లా సహకార బ్యాంక్ ఛైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి సతీమణి ఆనం అరుణమ్మ రెడ్డి నెల్లూరు జడ్పి ఛైర్మన్ గా దాదాపు ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరిలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వారందరు ఆనం వారి వైపే మ్రోగ్గుచూపుతున్నారని ,అందుకు నిదర్శనం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆనం వారి వైపు ఉన్నట్లు ప్రకటించారు. ఏది ఏమైనా వైసిపి లో  ఒకే సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గం లో పెద్ద కుటుంబాలు అయినా మేకపాటి, ఆనం మధ్య గట్టి పోటీ నెలకొంది. రెండు రోజులుగా ఆదాల రచన పేరు జోరుగా వినపడి ఇక తిరుగులేదు జడ్పి ఛైర్మన్ పదవి ఆదాల, మేకపాటి వారి సొంతం అనుకునే లోపు అనూహ్యంగా  ఈరోజు ఆనం అరుణమ్మ పేరు తెరపైకి వచ్చింది.రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయం నుండి భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి జడ్పిటిసిగా నామినేషన్ వేస్తున్నారు.జిల్లాలో ఆనం మార్క్ ప్రారంభం కాబోతోంది.#ఎస్పీన్యూస్#