జల్సాల దొంగ అరెస్ట్

జల్సాల దొంగ అరెస్ట్-


16గ్రాముల బంగారం స్వాధీనం



న్యూస్ ఫోర్స్,నెల్లూరు: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ, అందినకాడికి దోచుకుని విచ్చలవిడిగా తిరుగుతూ  ప్రజలను ఇబ్బంది పెడుతున్న దొంగని నవాబుపేట్ పోలీసులు అరెస్ట్ చేసారు. అతని వద్ద నుండి 40వేలు విలువైన16గ్రాముల బంగారు  ఉంగరాలు  నాలుగు స్వాధీనం చేసుకున్న పోలీసులు.చిత్తూరు జిల్లా, పూతల పట్టు,తుమ్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన పేటపల్లి యుఖేశ్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు, పప్పులవీధి,ప్రకాష్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై, జల్సాలకు అలవాటు పడి దొంగతనమే పరమావధిగా మార్చుకుని రోజు జీవనం గడుపుతున్నాడు.జనవరి22వ తేదీన జీనిగల వీధిలో నివాసం ఉంటున్న ప్రసాద్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు చాకచక్యంగా దొంగని శెట్టిగుంట రోడ్డులో ఓ టీ దుకాణం వద్ద అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు నవాబుపేట్ పోలీసు స్టేషన్ సిఐ తెలిపారు. దొంగని పట్టుకున్న వారిలో ఎస్సై రమేష్ బాబు,తదితరులును సిఐ అభినందించారు.#ఎస్పీన్యూస్#