నిఘా కెమెరాలు నీలి నీడలేనా..!?
★చోరీల అడ్డు కట్ట ఆగేనా...!
న్యూస్ ఫోర్స్, నెల్లూరు:ప్రతి ముఖ్య కూడలి, వీధుల్లో సైతం పోలీసులు నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను అరికట్టేందుకు సరి కొత్త రీతిలో ముందుకు సాగుతున్నారు. అయితే ఆయా ముఖ్యకూడలి లో మాత్రం కెమెరాలు పనిచేయడంలేదు.కొన్ని నేలను చూస్తూ దర్శనమిస్తున్నాయి.
నవాబుపేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కెమెరాలు కొన్ని పనిచేయడంలేదు.తడికల బజార్ ముఖ్య కూడలి, మీ సేవ వద్ద ఉన్న కెమెరా అయితే నేలను చూస్తున్నది.ఈ నెల9న సాయంత్రం 7గంటలుపైన అదే ప్రాంతంలో ఓ మహిళ మెడలో నుండి చైన్ ను స్నాచింగ్ దొంగ చైన్ ని లాక్కెళ్లాడు.నిఘా కెమెరాలు నిరుపయోగంగా, పనిచేయకుండా ఉండటం వలన నేరాలు అరికట్టేందుకు పోలీసులు విఫలమవుతున్నారు.రాబోవు వేసవికాలం దృష్ట్యా చోరీలు అధికామవుతాయని వాటిని అరికట్టేందుకు పోలీసులు నిఘా కెమెరాలుతో పాటు..వీధి వీధుల పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తే నేరాలు,చోరీలు తగ్గుముఖం పట్టవచ్చును.#ఎస్పీన్యూస్#