అభాగ్యులకు ఆహార పొట్లాలు పంపిణీ
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నగర పాలక సంస్థ విద్యుత్ కారు డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లోని యాచకులు, అభాగ్యులకు 400 ఆహార పొట్లాలను నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిఎస్ మూర్తి చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మూర్తి మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ప్రభుత్వం సూచించిన ప్రమాణాలను యువత పటిష్టంగా పాటించాలని,స్వచ్ఛంద సేవాకార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. నగర వ్యాప్తంగా ఉన్న వలస కూలీలు, వివిధ ప్రాంతాలనుంచి నగరానికి వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకున్న వారిని గుర్తించి వీలున్నంతలో ఆదుకోవాలని యూనియన్ సభ్యులకు ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో డ్రైవర్ ల యూనియన్ నాయకులుతదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#