వాలంటీర్ ని చితక్కొట్టిన 1వ డివిజన్ చోటా నాయకుడు

వాలంటీర్ ని చితక్కొట్టిన 1వ డివిజన్ చోటా నాయకుడు
★తనకు చెప్పకుండా పేదలకు డబ్బులు పంచాడని దాష్టీకం...



న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నగరంలోని నవలాకుల గార్డెన్స్ లో ఒకటో డివిజన్ వాలంటీర్ మహేష్ ను దారుణంగా కొట్టారు. ఆ డివిజన్ కి చెందిన ఓ చోటా నాయకుడు ,మహేష్ అనే వాలంటీర్ తాను చెప్పినట్లు చేయడం లేదని, తనకు చెప్పకుండా ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలు పేదలకు పంచాడని ఈ దారుణానికి ఒడిగట్టాడని సమాచారం.దళితుడైన ఈ వాలంటీర్ ను గదిలో బంధించి కొంతమంది వ్యక్తులతో కలిసి తీవ్రంగా కొట్టాడు. ఈ విషయమై వాలంటీర్లు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.#ఎస్పీన్యూస్#