ఉచితంగా పేదలకు 10రకాల నాణ్యమైన కూరగాయలు
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:రాష్ట్ర ఇరిగేషన్ మినిష్టర్ అనిల్ కుమార్,వైసీపీ యూత్ జిల్లా అధ్యక్షుడు రూప్ కుమార్ ల ఆదేశాలు తో నగరంలోని 41వ డివిజన్ లో ఉచితంగా నిరుపేదలకు 10రకాల కూరగాయలును డివిజన్ మాజీ కార్పొరేటర్ గోవుల నాగరాజు, గండికోట శ్రీనివాసులు లు పంపిణీ చేసారు.స్థానిక డివిజన్ లోని కొండదిబ్బ, ఎస్టీ కాలనీ లో 450మంది పేద ప్రజలకు ఉచితంగా కూరగాయలు అందజేశారు.లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు ఆపన్న హస్తమందించాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని నాగరాజు,శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణి, శివ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#