ఘనంగా బాబా సాహెబ్ 129వ జయంతి వేడుకలు
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:భారత రాజ్యాంగ సృష్టి కర్త,పేద, బడుగు వర్గాల ఆరాధ్యదైవం బాబా సాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలను 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ ఘనంగా నిర్వహించారు. స్థానిక నవాబుపేట్ ,కుసుమ హరిజనవాడలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ బలహీన వర్గాలలో వెలుగు జ్యోతి నింపిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కరని,ఆయన కలిపించిన రిజర్వేషన్లుతో ఎందరో బడుగులు అభివృద్ధి చెందారని కొనియాడారు. నిమ్న కులాలు కోసం అభివృద్ధికి బాటలువేసిన దార్శనీకుడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో10వ డివిజన్ వైసీపీ నాయకుడు శివారెడ్డి,వార్డు సచివాలయ అడ్మిన్ లు రాధ,ప్రభాకర్ రెడ్డి,విరోషా, శశి, వాలంటరీలు పవన్, సుజాత, లావణ్య, వైసీపీ కార్యకర్తలు శ్రీను,శ్రీకాంత్, మురళి తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#