కోవిడ్-19 వార్డు వైద్య సదుపాయాలుపై కలెక్టర్ సమీక్ష
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: జిల్లా జి.జి.హెచ్. ఆస్పత్రిలోని కోవిడ్ -19 క్వారంటైన్ వార్డును రీజినల్ సెంటర్ గా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్య సదుపాయాల ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ యం.వి. శేషగిరి బాబు, అధికారులు తో సమీక్షించారు.జిజి హెచ్. మెడికల్ సూపరింటెండెంట్ డా. శ్రీహరి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. సాంబశివరావులను ఆయనఆదేశించారు. సోమవారం రాత్రి నెల్లూరులోని జి.జి.హెచ్.ను జిల్లా కలెక్టర్ సందర్శించి వైద్య ఏర్పాట్లపై సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ తో సమీక్షించి తగు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉండాలని వైద్యశాఖ అధికారులకు స్పష్టం చేశారు. కోవిడ్ - 19 క్వారంటైన్ వార్డులో చేపట్టాల్సిన ఏర్పాట్లు, అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మెడిసిన్స్ గురించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్ డా. వినోద్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కల్పనా కుమారి, నుడా వైస్ చైర్మన్ బాపి రెడ్డి లు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#