లక్ష కుటుంబాలకు "సర్వేపల్లి రైతన్న కానుక"అందజేత
న్యూస్ ఫోర్స్,సర్వేపల్లి: నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం, అనికేపల్లి పంచాయతీలోని నాగులవరం, కాశీనగరం, రామాపురం గ్రామాలలో పర్యటించి, ఉచితంగా బియ్యం, వంట నూనెను వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష కుటుంబాలకు బియ్యం, వంట నూనె పంపిణీ చేసేటువంటి భాగ్యం కల్పించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో రైతుల దాతృత్వం మరిచిపోలేని సంఘటనని,కష్టకాలంలో సర్వేపల్లి నియోజకవర్గ రైతుల ఆదర్శం నా తుది శ్వాస వరకు మనసులో ఉండిపోతుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం లోని లక్ష కుటుంబాలకు ప్రతి ఇంటికి బియ్యాన్ని, వంట నూనెను అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కాకాణి తెలిపారు.ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సేవే ధ్యాసగా పని చేస్తానని,సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నన్నారు.#ఎస్పీన్యూస్#