కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న కృష్ణపట్నం పోర్ట్
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నదని నిరసిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ లో విలేేేకరుల సమావేశం నిర్వహించారు. సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ కరోనా వైరస్, ప్రపంచం మొత్తం మీద వ్యాపించి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి.అటువంటి కరోనా వైరస్ నివారించే దానికి ప్రపంచ దేశాలు తల పట్టుకొని ఉండే పరిస్థితుల్లో మన భారతదేశం కూడా వ్యాపించి అనేకమంది మరణాలకు కరోనా వైరస్ కారణం అయింది. ఈ దిశలో వైరస్ ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు భాగంగా లాక్ డౌన్ లు ప్రకటించడం జరిగింది.ఎవరి ఇళ్లలో నుంచి బయటికి రాకుండా వ్యక్తికి వ్యక్తికి దూరాన్ని పాటించమని పోలీసులు ఆరోగ్య అధికారులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రచారం చేస్తుందన్నారు. అయితే నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు తీరు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఈరోజు పోర్టులో వివిధ దేశాల నుంచి దాదాపు ఏడెనిమిది నౌకలో వస్తున్నాయి. ఈ వచ్చిన నౌకలను కూడా కరోనా ఎఫెక్ట్ ఎడ్ కంట్రీస్, నుంచి వచ్చినటువంటి నౌకలో బొగ్గు ఇతర దిగుమతులు చేసుకునే దానికి వచ్చే అందులో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు సిబ్బంది.దాదాపు నెల్లూరు నుంచి, పోయేదానికి 20 బస్సులు దాకా ఏర్పాటుచేసి ఒక్కొక్క బస్సులో 30 మందికి తక్కువ లేకుండా ప్రయాణం చేయిస్తున్నారు. మరి ఇంత దుర్భర పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించకుండా కరోనా వైరస్ ని ప్రభుత్వం ఏ విధంగా నిరోధించగలదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని కలెక్టర్ ,జిల్లా ఎస్పీ గమనించి కొంతకాలం వరకూ పోర్టు సిబ్బందిని పనులకు పంపించకుండా నివారించి ప్రజల ఆరోగ్యాన్ని, కరోనా వైరస్ నుంచి, కాపాడాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంద న్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.# ఎస్పీన్యూస్#