పేదలకు ఆహారం పంపిణీ చేసిన జర్నలిస్ట్ జమీర్
న్యూస్ ఫోర్స్, నెల్లూరు:కరోనా వైరస్ ను అంతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ కర్ఫ్యూ విధించడంతో నెల్లూరు పట్టణంలో కొంతమంది పేదలు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి నెల్లూరు పట్టణం కోటమిట్ట ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్. జమీర్ ఆహారం పంపిణీ చేశారు.
కోటమిట్ట ప్రాంతంలో గురువారం వెజిటబుల్ బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న అని" పేదవారిని ఆదుకోవడానికి ఇది సరైన సమయమన్నారు. ఎన్నో పేద కుటుంబాలు రోజువారి కూలీ చేసుకొని బ్రతికే వారికి ఈ లాక్ డౌన్ కారణంగా పనులు లేక తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి తమ వంతుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి వారిని గుర్తించి అన్నదాన కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రఫీ, మున్న, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#