35వ డివిజన్ లో  పేదలకు ఉచితంగా కూరగాయలు పంచిన వైసీపీ కార్యకర్త 

35వ డివిజన్ లో  పేదలకు ఉచితంగా కూరగాయలు పంచిన వైసీపీ కార్యకర్త 



న్యూస్ ఫోర్స్,నెల్లూరు:రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,రూరల్ కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు శరత్ చంద్ర,మస్తాన్ ల ఆధ్వర్యంలో గండి కోట శ్రీనివాసులు సహాయ సహకారాలు తో వైసీపీ కార్యకర్త మునిచంద్ర  400మంది నిరుపేదలకు ఉచితంగా  కూరగాయలు పంపిణీ చేశారు.స్థానిక 35వ డివిజన్ ఏ బ్లాక్ 10వ వీధిలో పేద ప్రజలకు ఉచితంగా కూరగాయలు  పంచారు. పేద ప్రజల కోసం తమ నాయకుల కృషి,తమ లాంటి కార్యకర్తల సేవలు ప్రజలకు నిరంతరం చేపడతామని  వైసీపీ కార్యకర్త మునిచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#