500మందికి పేదలకు ఉచితంగా కూరగాయలు,

500మందికి పేదలకు ఉచితంగా కూరగాయలు,మాస్క్ లు పంపిణీ చేసిన ""మనసున్నోడు శివారెడ్డి"



న్యూస్ ఫోర్స్, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు,జిల్లా యువజన అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ పిలుపు తో నగరంలోని10వ డివిజన్ లో మనసున్నోడు డివిజన్ నాయకుడిగా కొండా శివారెడ్డి ముందడుగు వేశారు.డివిజన్ లోని కోదండరామ పురం,గిరిజన కాలనీ, రామ్ నగర్ లలో నిరుపేదలకు ఉచితంగా వారంకి సరిపడే కూరగాయలను ఇంటికి ఇంటికి వెళ్ళి స్వయంగా తానే పంపిణీ చేశారు. అలాగే వారందరికీ మాస్క్ లు అందజేశారు.ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని ,సామాజిక దూరం పాటించాలని తెలిపారు.అంతేకుండా అత్యవసర మైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచనలిచ్చారు.ప్రజలకోసం నితత్యం కష్ట పడుతున్న మునిసిపల్ సిబ్బంది 30మందికి కూరగాయలు, నిత్యావసర వస్తువులు,మాస్క్ లిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాగరాజు నాయుడు,శ్రీకాంత్, వెంకట్రావ్,సురేష్,రాజా, గిరి తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#