డివిజన్ లో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసిన దామవరపు

డివిజన్ లో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసిన దామవరపు



 


న్యూస్ ఫోర్స్, నెల్లూరు: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఆదేశాల మేరకు డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్ నేతృత్వంలో 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ ఆధ్వర్యంలో 500మంది నిరుపేదలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు.నగరంలోని నవాబుపేట్, కుసుమ హరిజనవాడలో  భారత రాజ్యాంగ  సృష్టి కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిరుపేదలకు ఉచితంగా కూరగాయలును ఇంటింటికి పంచి పెట్టారు.ఈ బృహత్తర కార్యక్రమానికి10వ డివిజన్ వైసీపీ నాయకుడు కొండా శివారెడ్డి దాతృత్వంతో,గండికోట శ్రీనివాసులు సహాయ సహకారాలుతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించామని, పేదలను ఆదుకోవడంలో  తామేప్పుడు ముందుంటామని కార్పొరేటర్ రాజశేఖర్ తెలిపారు.ఈ డివిజన్ లో కుసుమ హరిజన వాడ ప్రజలు ఎంతో వెనుకబడి ఉన్నారని వారి అభివృద్ధి,అభ్యున్నతికి ఎపుడు కృషి చేస్తానన్నారు.ప్రజా సంక్షేమం కోసం అనిల్ అన్న ,ద్వారకన్న, తాము  ఎల్లపుడు ముందుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ సచివాలయం అడ్మిన్ లు విరోషా కట్టా, ప్రభాకర్ రెడ్డి,శశి కిరణ్, రాధ,వాలంటరీలు సౌజన్య, యువరాజ్, యాస్మిన్, శ్రీకల్యాణి,అనూష,అభిలాష, కీర్తన, సుజాత,కావేరి,విజిత, వరద రాజులు,శ్రీనివాసులు, తేజ, పవన్, లావణ్య, సచివాలయం మహిళ కానిస్టేబుల్ శర్వాణి,రూప, సబిహా, సుస్మిత తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#