నిరుపేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ
న్యూస్ ఫోర్స్, టిపి గూడూరు: నియోజకవర్గ పరిధిలోని తోటపల్లి గూడూరు మండల కేంద్రం,ఇస్కపాలెం గ్రామంలో వై యస్ ఆర్ సిపి నెల్లూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సహాయ సహకారాలతో వైసిపి మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్ చేతులు మీదుగా 600 నిరుపేదల కుటుంబాలకు కూరగాయలు పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ నేపధ్యంలో పేదలు ఎటువంటి కష్టాలు పడకుండా ఉండాలని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత నిధులతో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి శేషమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాసులు నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#