9వ డివిజన్ లో 500మంది పేదలకు అన్నదానం

9వ డివిజన్ లో 500మంది పేదలకు అన్నదానం



న్యూస్ ఫోర్స్,నెల్లూరు:  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఆదేశాల మేరకు పేదవారికి పట్టిడన్నము పెట్టాలనే సంకల్పానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు లాంటి మంచి మనసున్న సేవా పరులు నెల్లూరు డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్  చేయూత తో 9డివిజన్ మాజీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్ని రకాల కూరలుతో  రుచి కరమైన భోజనం ఏర్పాటు చేశారు.నగరంలోని 9వడివిజన్ కుసుమ హరిజనవాడలో 500మంది నిరుపేదలకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ ద్వారకానాధ్  మాట్లాడుతూ పేదవారికి కడుపు నిండా భోజనం పెట్టడంలో ఉన్న ఆనందం ఇంకా ఎందులోనూ ఉండదన్నారు.మంత్రి అనిల్ కుమార్ సూచనల మేరకు పలు డివిజన్లలో పేదవారికోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నమన్నారు.ఈ కార్యక్రమానికి శ్రీనివాస క్యాటరింగ్ శ్రీనివాసులు సహకారం అందించారు.ఈకార్యక్రమంలో  10వ డివిజన్ కొండా శివారెడ్డి,విద్యార్థి నాయకుడు సత్య కృష్ణ,వైసీపీ కార్యకర్తలు శ్రీను, వెంకట్రావ్ ,బాలాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#