పేదలకు 9రకాల కూరగాయల్ని పంపిణీ చేసిన శ్రీనివాస్ గౌడ్
న్యూస్ ఫోర్స్,నెల్లూరు : రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నియోజకవర్గ ఆఫీస్ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ల ఆదేశాలు మేరకు పేద ప్రజలకు కూరగాయలును వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాల శ్రీనివాసులు గౌడ్,34వ డివిజన్ ఇంఛార్జ్ హాజరత్ నాయుడు కలిసి పంపిణీ చేసారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని స్థానిక 34వ డివిజన్ వెంగళరావు నగర్ లో 100 మంది నిరుపేద కుటుంబాలకు 10రోజులకు సరిపడే 9రకాల కూరగాయలును వారు పంచి పెట్టారు.ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలును ఆడిటర్ మధుసూదన్ రెడ్డి,సీనియర్ లాయర్ మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి,అన్నపురెడ్డిలు అందించారు. ఈ కార్యక్రమంలో జి.వెంకట రాజు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#