ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సాయం
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కింద ₹1000 నగదును అందజేస్తున్నదని వైకాపా 10వ డివిజన్ నాయకులు కొండా శివారెడ్డి తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు బాసటగా నిలవాలని ,నిరంతరం ప్రజాక్షేమం కోరే సీఎం జగన్ కి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.డివిజన్ లోని పలువురుకు 1000₹ఆర్థిక సాయంని శివారెడ్డి చేతుల మీదుగా వాలంటరీలు పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో వైసీపీ డివిజన్ నాయకులు నాగరాజు నాయుడు,లబ్ధిదారులు సుశీలమ్మ,రత్తమ్మ,వాలంటరీలు, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#