అభాగ్యులకు కూరగాయలు పంపిణీ చేసిన జమీర్
న్యూస్ ఫోర్స్, నెల్లూరు:పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదవారికి నేనున్నానంటూ భరోసానిస్తూ వారికి కూరగాయలను ఇంటింటికి వెళ్లి జమీర్ పంచి పెట్టారు . స్థానిక కోటమిట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్ జమీర్ మరియు వారి స్నేహితులు కలిసి లాక్ డౌన్ కారణంగా ఎంతమందో పస్తులతో ఉంటున్నారని తెలుసుకుని వారికి తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.కోటమిట్ట, జెండావిధి తదితర ప్రాంతాలలో పేదవారికి కూరగాయలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముజ్జు, రియాజ్, బుజ్జు, రఫీ, అలీ, ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#