దార్శనీకుడు అంబేద్కర్- కమిషనర్ మూర్తి
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: అంబేద్కర్ 129వ జయంతిని పురస్కరించుకుని కార్పోరేషను కార్యాలయంలో కమిషనర్ మూర్తి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారత దేశంలో వేలాది కులమతాల వ్యవస్థ కన్నా సమధర్మం మాత్రమే అత్యున్నతమైనదని గుర్తించిన దార్శనీకుడు డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ అని కొనియాడారు. విద్యతో మాత్రమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని ప్రకటించి, నిమ్న వర్గాల విద్యాభివృద్ధికి అంబేద్కర్ ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#