కరోనాపై అధికారులుతో మంత్రులు సమీక్ష
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నందు ఐ.టి., పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ లు కలిసి జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, నోడల్ అధికారి బాపిరెడ్డి, ప్రధాన వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కరోనా బాధితుల వివరాలను అడిగి తెలుసుకొని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండాలని, పేషెంట్ లకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ వై.ఎస్.ఆర్.సి.పి. ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#