లాక్ డౌన్ లో చిక్కుకున్న భక్తులకు ఆహారం అందజేత

లాక్ డౌన్ లో చిక్కుకున్న భక్తులకు ఆహారం అందజేత



న్యూస్ ఫోర్స్,ఏ యస్ పేట:మహమ్మద్ రఫీ కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఏఎస్ పేటలో లాక్ డౌన్ వలన చిక్కుకున్న భక్తులకు ఆహారం ప్యాకెట్ల పంపిణీ చేశారు.జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణానికి చెందిన మహమ్మద్ రఫీ కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో యాత్రా స్థలం మండల కేంద్రమైన ఏఎస్ పేట దర్గా దర్శనానికి వచ్చి,కరోనా వైరస్ ప్రభావంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కర్ఫ్యూ విధించడంతో తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక ఏఎస్ పేట లోనే చిక్కుకున్నారు భక్తులు. వివిధ దూర ప్రాంతాలకు చెందిన భక్తులకు స్థానికంగా ఉన్న పేద ప్రజలకు యాచకులకు గురువారం 5 వందల ప్యాకెట్లు విజిటబుల్ బిర్యానీ ఆహారాన్ని ప్రత్యేక వాహనంలో నెల్లూరు నుండి తెచ్చి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  షేక్. జాకీర్ మాట్లాడుతూ లాక్ డౌన్ కర్ఫ్యూ మొదలైనప్పటి నుండి నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో బారాషహీద్ దర్గా వద్ద పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అలాగే కసుమూరు దర్గా  దర్శనానికి వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకున్న భక్తులకు ఆహారాన్ని పంపిణీ చేశామని, ఇప్పుడు ఏఎస్ పేటలో కూడా భక్తులకు"వెజిటేబుల్" బిరియాని ఆహారాన్ని  5 వందల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. లాక్డౌన్ ముగిసేంత వరకూ తమ వంతుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు షేక్. షాజహాన్, షేక్. గఫార్, సీనియర్ జర్నలిస్ట్  సయ్యద్. జమీర్, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#