పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం



న్యూస్ ఫోర్స్,నెల్లూరు:కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ ప్రకటించడంతో నిరుపేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.లాక్ డౌన్ నేపధ్యంలో పేదలు మరింత పేదవారిగా మారిపోతు వారి జీవనాధారం మరింత దుర్భరంగా మారింది.దీనితో పేదవారికి ఆకలి తీర్చేందుకు తమవంతుగా వేముల శ్రీను,కృష్ణారెడ్డి ముందుకువచ్చారు.స్థానిక బాబు గిరిజన కాలనీలో 10వ డివిజన్ నాయకులు కొండా శివారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ సిఐ సోమయ్య పాల్గొని ఆయన చేతుల మీదుగా అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ స్టేషన్ ఎస్సై అంకమ్మ,వైసీపీ కార్యకర్తలు రాజేష్ రెడ్డి, ప్రసాద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#