కరోనా నివారణ చర్యలుకు దాతల విరాళాలు

కరోనా నివారణ చర్యలుకు దాతల విరాళాలు



న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నగరంలోని ఇస్కాన్ సిటీ నందు గల మంత్రి క్యాంపు కార్యాలయంలో నగరంలోని సింహపురి వాణిజ్య మండలి, దాల్ మిల్లు అసోసియేషన్స్, టమరాండ్ మర్చంట్స్ అసోసియేషన్, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ల వారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ ని కలిసి 30 వేల శానిటైజర్స్ ను అందించారు. అలాగే కరోనా నియంత్రణలో భాగంగా ఎ.పి. ఛాంబర్ అఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ సన్నపురెడ్డి పెంచలరెడ్డి తన  సొంత నిధుల నుంచి 2 లక్షల రూపాయల చెక్కు, పి.ఎన్.ఆర్. బాత్ హౌస్ వారు 1 లక్ష రూపాయల చెక్కు, సంగం మాజీ జెడ్.పి.టి.సి. ఇందూధర్ రెడ్డి 1 లక్ష రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,జిల్లా యువజన అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్, వై.ఎస్.ఆర్.సి.పి. రాష్ట్ర  కార్యదర్శి ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి.పి. వాణిజ్య మండలి నగర అధ్యక్షులు శ్రీరాం సురేష్, అసోసియేషన్ నాయకులు పెసల నరసింహస్వామి, గొల్లపల్లి సునీల్, సరాబు సురేష్, పెసల సురేష్, దాసా లక్ష్మీనారాయణ, సోల్లేటి వెలుగొండయ్య, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#