తాత బాటలో బొమ్మిరెడ్డి తారక్
న్యూస్ ఫోర్స్, ఏయస్ పేట్: ఆత్మకూరు ప్రజల అభిమాన నేత దివంగత బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి బాటలో ఆయన మనవడు బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి నడుస్తున్నారు. కరోనా వైరస్ జిల్లాలో రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో తన వంతు చేయూతగా. రూ. 1.50 లక్షల విలువైన శాని టైజెర్స్, మాస్కులను శుక్రవారం అందజేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ ఇతర అధికారులకు వాటిని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి తారక్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో తన వంతు బాధ్యతగా ఈ సహాయం అందజేశానని పేర్కొన్నారు.తాత బాటలోనే మనవడు సేవ చేస్తున్నాడని పలువురు కొనియాడారు.#ఎస్పీన్యూస్#