సోమందేపల్లిలో దాతృత్వం  చూపిన వైసిపి నాయకులు

 సోమందేపల్లిలో దాతృత్వం  చూపిన వైసిపి నాయకులు


 



★మంత్రి శంకర్ నారాయణ ఆదేశాల మేరకు 1000 నిత్యవసర సరుకుల ప్యాకెట్లు పంపిణీ



న్యూస్ ఫోర్స్, అనంతపురం: కోవిడ్ - 19 రాష్ట్రంలో ప్రబలకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సోమందేపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి మాలగూండ్ల శంకరనారాయణ  పిలుపు మేరకు మండలంలోని వైసీపీ నాయకులు ఆద్వర్యంలో దాదాపు 1000 మందికి 5కేజీల రైస్, కేజి కందిపప్పు, కూరగాయలు సామాజిక దూరం పాటిస్తూ మంత్రి శంకరనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ కరోనా వ్యాది వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా నిత్యావసర సరుకులకు నోచుకోని పేద ప్రజలను సోమందేపల్లిలో 1000 మందిని గుర్తించి వారికి వైఎస్సార్ సిపి పార్టీ తరఫున నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలోని పేద ప్రజలు ఎవ్వరూ ఇబ్బందులు పడకూడదని నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం నగదు రూపంలో 1000 రూపాయలు వాలంటీర్ల ద్వారా ఆర్థికంగా చేయూత ఇవ్వడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా హార్టికల్చర్, ఆక్వా, వరి,మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పంటలను విక్రయించేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాలకు కూడా నోచుకోని పేద ప్రజలకు సోమందేపల్లి లోని వైఎస్సార్సీపీ నాయకులు ముందుకు వచ్చి వారికి అండగా నిలిచినందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కరోనా విపత్తు సమయంలో పనులు లేక , ఆదాయం లేక సతమతమవుతున్న పేద ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు అండగా నిలుస్తూ, దాతృత్వం చాటుతున్నారని అన్నారు. నిస్వార్ధంగా ప్రజలకు అండగా నిలుస్తున్న వైఎస్ఆర్ సీపీ శ్రేణులు పైన రాజకీయాలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి సమయాల్లో రాజకీయాలు మానుకొని ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ భాద్యతాయుతంగా వ్యవహారించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి మండల వైసీపీ కన్వీనర్ వెంకటరత్నం, పెనుగొండ మండలం వైసీపీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు ఈశ్వరయ్య, డిసి అశోక్, ఎల్లారెడ్డి, ఇమామ్ వలీ, గాజుల శ్రీనివాసులు, తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#