మురికి కాలువల పూడికతీత ను పరిశీలన
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగరంలోని గాంధీ గిరిజన కాలనీ,రామ్ నగర్ ప్రాంతాల్లో మురికి కాలువల పూడిక తీయకుండా అలానే ఉండడంతో వాటిని వైసీపీ 10వ డివిజన్ నాయకుడు కొండా శివారెడ్డి పరిశీలించారు. కాలువల్లో మురుగు నీరు ముందుక కదలకుండా గత30రోజులుగా దుర్గంధం వస్తుందని స్థానిక ప్రజలు ఆయనకి వివరించారు. అక్కడే ఉండి అధికారులకు ఫోన్ చేసి సత్వరమే కాలువలు పూడికతీత,పరిశుభ్రతగా వీధులను చేయాలని ఆయన వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నాగరాజు నాయుడు, కార్యకర్తలు రాజేష్ రెడ్డి,ప్రసాద్ రెడ్డి, రాజా , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#