నా కన్నీటితో సర్వేపల్లి రైతుల పాదాలు కడిగిన రుణం తీర్చుకోలేను-కాకాణి

నా కన్నీటితో సర్వేపల్లి రైతుల పాదాలు కడిగిన రుణం తీర్చుకోలేను-కాకాణి



న్యూస్ ఫోర్స్, నెల్లూరు,వెంకటాచలం: సర్వేపల్లి నియోజకవర్గ రైతుల దాతృత్వం మరువలేనిది, వారులేకుంటే ఇంతటి మహాయజ్ఞాన్ని సాధించలేమని వారి పాదాలను తన కన్నీటితో కడిగిన రుణం తీర్చుకోలేనని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి  భావోద్వేగంతో ప్రసంగించారు.సర్వేపల్లి రైతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి పేదలకు బాసటగా నిలవడంతో సర్వేపల్లి రైతన్న కానుక విజయవంతం అయిందని కాకాణి తెలిపారు.స్థానిక గొలగమూడి వెంకయ్య స్వామి సన్నిధి,కల్యాణ మండపంలో ఘనంగా  సర్వేపల్లి రైతన్న కానుక మహోత్సవాన్ని అట్టహాసంగా మాజీ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ శ్యామ్ సుందర రెడ్డి చేతుల మీదుగాఎమ్మెల్యే లు వరప్రసాద్, సంజీవయ్య,కాకాణి ల సమక్షంలో ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.ముందుగా స్వర్గీయ మహానేత వైఎస్సార్ కి ఇద్దరు ఎమ్మెల్యేలుసంజీవయ్య, వరప్రసాద్ చేతులతో పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమం విజయవంతంకు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు పాట తో ప్రారంభించారు.అనంతరం నెల్లూరు నగరంలో మాగుంట లేవుట్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ఇరిగేషన్ మినిష్టర్  అనిల్ కుమార్,తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు ,సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య,రూరల్ ఎమ్మెల్యే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి లు పేదలకు సర్వేపల్లి రైతన్న కానుక 5,10కేజీల బ్యాగులు ,వంటనూనె ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే ఈ మహా యజ్ఞానికి సహకారం అందించిన రైతులకు అభినందన పత్రాలును ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి అందజేశారు.ఈ బృహత్తర కార్యక్రమంకు ముందు టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎంతో సమర్థుడని రాష్ట్రంలో ఎవ్వరు సాహసించని మహోన్నత అద్భుత కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారని,ఈ కార్యక్రమానికి తాము హాజరవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.సర్వేపల్లి రైతుల ఎంతో గొప్ప ఉన్నత మనసు కలవారని వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.అలాగే ఆయిల్ కంపెనీలు కూడా కాకాణి సంకల్పానికి మద్దతుగా నిలిచి వారి నిండు మనసును తెలిపారన్నారు.రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో గోవర్ధన్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమైనదని,ప్రజలకోసం ఆ తపన నిరంతరం ఉండబట్టే ఎవ్వరు చేయలేనిది చేయగలిగారని అందరిని భాగస్వామ్యం చేసి లక్ష కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారన్నారు.కాకాణి గోవర్ధన్ అన్న సంకల్పంతో పని చేస్తారని మంత్రి అనిల్ అన్నారు.ఈ కార్యక్రమంలో కావలి ఏఎంసీ ఛైర్మన్ సుమంత్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ తదితర రైతులు  పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#