ఘనంగా గిరిజనులకు అన్నదాన కార్యక్రమం

ఘనంగా గిరిజనులకు అన్నదాన కార్యక్రమం



న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగరంలోని 10వ డివిజన్ బాబు గిరిజన కాలనీలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక
మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద 500 మంది గిరిజనులకు ఆహారాన్ని పంచి పెట్టారు.ఈకార్యక్రమానికి 10వ డివిజన్ నాయకులు కొండా శివారెడ్డి హాజరై రెడ్ క్రాస్ వారితో కలిసి పేద వారు అయిన గిరిజనులకు అన్నదానం చేశారు.గత మూడు రోజులుగా ఇదే ప్రాంతంలో అన్నదానం చేస్తున్నారు.ఈ ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువగా ఉండటంతో వారికి బాసటగా నిలవాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నామని శివారెడ్డి తెలిపారు.మంత్రి అనిల్ కుమార్ ఆదేశాలతో పలువురుకు అన్న ఆహారం అందించడం జరుగుతుందన్నారు.వాటికి రెడ్ క్రాస్ వారు ఎంతో సహకరిస్తున్నారని, మరికొందరు దాతలు కూడా  ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మహానుభావులందరికి నా కృతజ్ఞతలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నాగరాజు నాయుడు,రెడ్ క్రాస్ సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు రాజేష్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి,శ్రీకాంత్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#