పోలీస్ సేవలు గుర్తించిన సీఎంకు ధన్యవాదాలు
--జిల్లా అధ్యక్షుడు ప్రసాద్
న్యూస్ ఫోర్స్, నెల్లూరు:ప్రపంచ మహమ్మారి కరోనాని ఎదుర్కొంటున్న రాష్ట్రంలో పోలీస్ సేవలను గుర్తించి పూర్తి జీతాలు ఇస్తామన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని నెల్లూరు జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాద్ రావు తెలిపారు.కరోనా నియంత్రణకు నిత్యం పోలీసులు, వైద్యులు,శానిటేషన్ సిబ్బంది సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి వారికి పూర్తి స్థాయిలో జీతాలను చెల్లిస్తామని సీఎం తెలపడం శుభపరిణామం అని అన్నారు.పోలీసుల జీతాలు పూర్తిగా చెల్లించే విధంగా సీఎం వద్దకు తీసుకెళ్లిన రాష్ట్ర పోలీసు దళపతి గౌతమ్ సవాంగ్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పోలీసులు నిర్విరామంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ ఇళ్లను వదిలి విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు.జిల్లాలో సమర్థవంతంగా కరోనాని తరిమికొట్టేందుకు పోలీసు సేవలు ఆమోఘమని ,జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలతో పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. పోలీసులకు శానిటైజర్స్,మాస్క్ లు,గ్లౌజులు అందజేసిన మంత్రులు పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్,మేకపాటి గౌతంరెడ్డి ,రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు తెలిపారు.మరొకసారి మరల పోలీసులుకు మాస్క్ లు,శానిటైజర్స్ అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు సంఘం కోశాధికారి తురకా శ్రీనివాసులు, డైరెక్టర్ బెల్లంకొండ రమణయ్య లు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#