"సర్వేపల్లి రైతన్న కానుక "పేరుతో సరికొత్త రీతిలో ఎమ్మెల్యే కాకాణి శ్రీకారం


"సర్వేపల్లి రైతన్న కానుక "పేరుతో సరికొత్త రీతిలో ఎమ్మెల్యే కాకాణి శ్రీకారం



★నియోజకవర్గ ప్రజలకు ఆపన్న హస్తమందిస్తున్న గోవర్ధన్ రెడ్డి


★2కోట్ల విలువైన బియ్యం,
కోటి రూపాయల విలువైన వంట నూనె పంపిణీ కి సిద్ధం..!?


★నియోజకవర్గ పేదలకు వరంగా మారిన ఎమ్మెల్యే..!



న్యూస్ ఫోర్స్,సర్వేపల్లి:నియోజకవర్గ పరిధిలోని పేద ప్రజలకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఓ వరంగా మారారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలు,రాష్ట్రాలను సైతం వణికిస్తున్న తరుణంలో లాక్ డౌన్ ను ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి.ఈ నేపధ్యంలో బీద వారు మరింత కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు.అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో తానున్నానంటూ భరోసానివ్వడమే కాక వారికి చేయూతనందిస్తున్నారు గోవర్ధన్ రెడ్డి. నియోజకవర్గ పరిధిలో 1లక్ష మంది అర్హత కలిగిన నిరుపేదలకు  2కోట్ల విలువైన బియ్యం,కోటి రూపాయల విలువైన వంటనూనె సరఫరా కి సిద్ధమవుతున్నాయి.ప్రతి కుటుంబానికి 5కేజీలు ,పదికేజీ ల బియ్యపు బ్యాగులు,1లీటర్ వంట నూనె ని ఉచితంగా  పంపిణీ చేయాలని ప్రత్యేకంగా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి  శ్రీకారం చుట్టారు.పేదలకు "సర్వేపల్లి రైతన్న కానుక" పేరుతో వినూత్న రీతిలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి బ్యాగులు తయారు చేయించారు.బ్యాగుకు ఒకవైపు "సర్వేపల్లి రైతన్న కానుక" నాగలి పట్టిన రైతు బిడ్డలా సిఎం జగన్, వరి నాట్లు పొలాల మధ్య తలపాగా చుట్టుకుంటున్న వైయస్సార్ , శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి బొమ్మలతో ప్రచురించి వున్నాయి.నియోజకవర్గ రైతులు, దాతల సహకారంతో పేదలకు ఆపన్న హస్తమందిస్తున్నారు ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి.తన నియోజకవర్గ పరిధిలో ఎవ్వరు ఆకలితో అలమటించకూడదనే నిండు మనస్సుతో ఈ అద్భుత సంకల్పానికి శ్రీకారం చుట్టారు.నిరంతరం ప్రజా సేవకై పరితపించే నేతగా సర్వేపల్లి ప్రజల హృదయాల్లో ఎమ్మెల్యే కాకాణి నిలిచిపోయారు.#ఎస్పీన్యూస్#