నవాబుపేట్కాదు..!? ఒంగోలు కిచెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్
★సిఐ వేమారెడ్డికి అభినందన వెల్లువ
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగరంలోని నవాబుపేట్ కి చెందిన వ్యక్తికి కాదు ఒంగోలు కి చెందిన వ్యక్తి హయత్ భాషాకి కరోనా పాజిటివ్ తేలిందని నవాబుపేట్ సిఐ వేమారెడ్డి వివరణ ఇచ్చారు.ఎందుకంటే నవాబుపేట్ అని నిన్న ఆరోగ్య బులిటెన్ లో వచ్చిందని స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ ని న్యూస్ ఫోర్స్ వివరణ కోరగా ఆయన పై విధంగా స్పందించారు. ఒంగోలు గోపాలపురంకి చెందిన హయత్ భాషా కి ఒంట్లో నలతగా ఉండడంతో నెల్లూరు బంగ్లా తోటలో ఉన్న తన అన్నకి ఫోన్ చేసి చెప్పాడు. ఒంగోలులో ఆర్ ఎం పి డాక్టర్ కి చూపించిన తగ్గలేదనడంతో తన అన్న నెల్లూరు కి రా ఇక్కడి చూపిస్తామని చెప్పాడని ఆయన తెలిపారు. దీనితో భాషా ఒంగోలు నుండి అంబులెన్స్ లో నెల్లూరు కి వచ్చి తన అన్నతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.అక్కడ క్వారెంటెన్ లో భాషాని చేర్చుకున్నారు.నిన్న ఒంగోలు కి చెందిన వ్యక్తి కి కరోనా పాజిటివ్ రాగా దానికి స్థానిక వాళ్ళ అన్న ప్రదేశం నవాబుపేట్ అని బులిటెన్ లో పొందుపరిచారు.అయితే స్థానిక నవాబుపేట్ సిఐ వేమారెడ్డి స్పందించి భాషా కి చెందిన తన అన్న కుటుంబసభ్యులు అయిన నవాబుపేట్ బంగ్లాతోట లో ఉన్న10మంది సభ్యులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అంతేకాకుండా ఒంగోలు లో ఉన్న హయత్ భాషా భార్య, బిడ్డలను కూడా అక్కడి క్వారెంటెన్ కి తరలించేలా ఒంగోలు 2వపట్టణ సిఐ కి సమాచారం చేర వేశామని నవాబుపేట్ సిఐ తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలులో భాగంగా నవాబుపేట్ సిఐ ప్రత్యేక చొరవ చూపడంతో స్థానిక ప్రజలు ఆయనని ప్రశంసిస్తున్నారు.#ఎస్పీన్యూస్#