డివిజన్ ప్రజలకు మాస్క్ లు పంపిణీ చేసిన రాజశేఖర్
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగరంలోని 9వ డివిజన్ కుసుమ హరిజనవాడ ప్రజలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దాతృత్వంతో 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి మనసున్న మంత్రి అనిల్ అన్న సహకారంతో తమ ప్రాంత డివిజన్ ప్రజలకు కరోనా నియంత్రణ కోసం మాస్క్ లు పంపిణీ చేశామన్నారు. ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజేష్, సాయి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీ న్యూస్#